Saturday, April 27, 2024

కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. ట్రైబ్యునల్స్‌లో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫైర్‌ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునల్స్‌ను మూసి వేయమంటారా ? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో రద్దు చేసిన అంశాలతో మళ్లీ మరో చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం ఏంటని సూటిగా ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ. ఇక నైనా ఆ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.

వివిధ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో 240 ఖాళీల భర్తీపై పిటిషన్లను ఎన్వీ రమణ నేతృత్వంలోని, జస్టిస్ చండ్రచూద్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన స్పెషల్ బెంచ్ విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ కొనసాగాలని కోరుకోవడం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్‌సీఎల్‌టీ‌, ఎన్‌సీఎల్‌ఏటీ వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయని ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనని తెలిపింది. వీటితో పాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. దీని వల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోందని కోర్టు వెల్లడించింది. దీనికి కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపారు.

ఇది కూడా చదవండి: వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే ఆయనే గుర్తోచ్చారు: ఏపీ స్పీకర్ తమ్మినేని

Advertisement

తాజా వార్తలు

Advertisement