Monday, April 29, 2024

ఈనెల 12నే నీట్ పరీక్ష.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

నీట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు కేంద్రం కొంతకాలం కిందట ప్రకటన చేసింది. అయితే సెప్టెంబరు 12న మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది.

నీట్ పరీక్ష యథాతథంగా ఈనెల 12నే జరుగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారని, విద్యావ్యవస్థలపై తాము జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినా ఏ కొందరి కోసమో నీట్ వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఒకేరోజున అనేక పరీక్షలు ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారని, అలాంటప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవడం మేలు అని సుప్రీంకోర్టు సూచించింది.

ఈ వార్తను కూడా చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Advertisement

తాజా వార్తలు

Advertisement