Monday, September 20, 2021

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.

ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. EPFO ..2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బులను త్వరలోనే పీఎఫ్ ఖాతాదారుల ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేయనుంది. దీపావళి పండుగలోగా పీఎఫ్ వడ్డీ డబ్బులను ఖాతాదారులకు అందించనున్నట్టు సమాచారం. ఈపీఎఫ్‌వో ఈ మేరకు ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు వడ్డీ రేట్లకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వస్తే ఖాతాదారుల అకౌంట్స్‌లోకి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రూ.8.5 శాతానికి తగ్గించింది. దీంతో ఖాతాదారులకు 8.5 శాతంతో వడ్డీ డబ్బులు వస్తాయి. కాగా 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా, 2017-18లో 8.55 శాతంగా 2016-17లో రూ.8.65 శాతంగా ఉండటం గమనార్హం.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో స్పా సెలూన్ పేరుతో వ్యభిచారం దందా.. 23 మంది అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News