Thursday, May 16, 2024

గాలి నాగేశ్వర్రావుతో సన్నీలియోన్​.. జోష్​ పెంచుతున్న సినీ యూనిట్​..

లేటెస్ట్‌గా మంచు విష్ణు ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న‌మూవీ గాలి నాగేశ్వ‌ర‌రావు. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియాలో మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాయిల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.
తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ జాయిన్ అయింది. ఈ సినిమాలో రేణుక అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు త‌న ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సన్నీ.

ప్ర‌స్తుతం ఈసినిమా తిరుప‌తిలో షూటింగ్ జ‌రుగుతుంది. ఈరోజు స‌న్నీలియోన్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. గ‌తంలో మంచు మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కిన ‘క‌రెంట్ తీగ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియెన్. ఈసారి మంచు విష్ణుతో రీ ఎంట్రీకి సిద్ద‌మైంది. ఇందులో స‌న్నీ రోల్ కేవ‌లం గ్లామ‌ర్‌కే పరిమితం కాకుండా క‌థ‌ను మ‌లుపు తిప్పే విదంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ క‌థ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement