Saturday, May 4, 2024

గుడ్​ న్యూస్​.. రద్దీ దృష్ట్యా పట్టాలపైకి సమ్మర్​ స్పెషల్స్ ట్రైన్స్​

సమ్మర్ సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రద్దీ దృష్ట్యా పలు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No. 07003: హైదరాబాద్ నుంచి సోలాపూర్ కు ఈ నెల 24 నుంచి మే 14వ తేదీ వరకు ప్రతీ రోజు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 12.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.07004: సోలాపూర్-హైదరాబాద్ ట్రైన్ ను సైతం ఏప్రిల్ 24 నుంచి మే 14వ తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ సోలాపూర్ లో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి.. రాత్రి 8.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

అదే విధంగా పలు రైళ్ల వివరాలు ఈ దిగువన ఉన్నాయి.. ప్రయాణికులు పరిశీలించుకుని జర్నీ చేయాలని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement