Friday, October 4, 2024

రామరాజ్యం కోరేవాళ్లంతా బీజేపీలోకి రండి – బండి సంజయ్

కరీంనగర్ – తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే. కేసీఆర్ నియంత-అవినీతి-కుటుంబ అరాచకాలకు అంతం పలకడమే లక్ష్యంగా బీజేపీ పోరాడుతోంది. రామరాజ్యం కోరుకునే వాళ్ళంతా బీజేపీలో చేరండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం జగదంబ తండా గ్రామ ఉప సర్పంచ్ ప్రమీల, వార్డ్ మెంబర్స్, రాజమణి, సోనా, అమృత, సరిత, సక్రి తోపాటు సుమారు వందమంది కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ కాషాయ కండువా కప్పి బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. వడగాళ్ల వానతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేసీఆర్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప రైతులను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజాస్వామ్య పాలన కోరుకునే వాళ్లంతా బీజేపీతో చేతులు కలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రెడ్డి బోయిన గోపి, మండల అధ్యక్షులు గంట అశోక్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు తిరుపతి,ఓబీసీ అధ్యక్షులు, ఆకుల మురళీమోహన్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు, కోడె రమేష్, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, సర్వతం,అయోధ్య రవి, మద్దుల రాజిరెడ్డి, భాస్కర్ నాయక్, శ్రవణ్ యాదవ్, కొక్కు దేవేందర్ యాదవ్, అన్వరు, అరవింద్,మరియు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement