Sunday, May 5, 2024

రంగంలోకి ఆత్మాహుతి డ్రోన్లు.. జావెలిన్​, స్టింగర్​తో దీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్​

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఒకవైపు చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. దాడులు జరుగుతున్నాయి. దాడులు ఆపాలని ఉక్రెయిన్‌ విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆత్మాహుతి డ్రోన్లను ఉక్రెయిన్‌ రంగంలోకి దించింది. ఇప్పటికే జావెలిన్‌, స్టింగర్‌తో ఉక్రెయిన్‌ డిఫెన్స్ ను బలోపేతం చేసిన అమెరికా, ఇప్పుడు స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లను ఉక్రెయిన్‌కు అమెరికా పంపిస్తున్నది. ఇదొక బ్రహ్మస్త్రంగా చెప్పుకోవచ్చు. ఈ డ్రోన్లు రష్యా సైనిక వాహనాలను, కాన్వాయ్‌లను దెబ్బతీస్తాయి. ఇప్పటికే యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులతో రష్యన్ల ట్యాంక్‌లను ఉక్రెయిన్‌ నాశనం చేస్తున్నది. ఈ డ్రోన్ల రూపంలో మరో అస్త్రం ఉక్రెయిన్‌కు అందినట్టయ్యింది. స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లతో కొన్ని కిలోమీటర్ల నుంచే శత్రువులపై దాడి చేయవచ్చు. అటు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపైనా.. రష్యా రాకెట్‌ బాంబులను ప్రయోగిస్తున్నది. రష్యన్‌ ఆర్మీని ఉక్రెయిన్‌ ధీటుగా ఎదుర్కొంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement