Monday, April 29, 2024

Sudipto sen : సుబ్ర‌తో రాయ్ బ‌యోపిక్.. స‌హార శ్రీ టైటిల్

సుబ్ర‌తో రాయ్ ఈయ‌న స‌హారా ఇండియా వ్య‌వ‌స్థాప‌కుడు, వ్యాపార‌వేత్త.. కాగా ఈయ‌న జీవిత క‌థ ఆధారంగా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వివాదాస్ప‌ద ద కేర‌ళ స్టోరీ చిత్రాన్ని తీసిన సుదీప్తో సేన్ ఈ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ ప‌దో తేదీన సుబ్ర‌తో రాయ్‌కు 75 ఏళ్ల నిండుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సందీప్ సింగ్‌, డాక్ట‌ర్ జ‌యంతిలాల్ ప్రొడ్యూస‌ర్లుగా ఈ ఫిల్మీ తీయ‌నున్నారు. భార‌త దేశంలో ఎలా సుబ్ర‌తో రాయ్ ఓ డైన‌మిక్ వ్యాపారిగా మారాడో ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. ఈ ఫిల్మ్‌కు క‌త‌ను రిషి వీర‌మ‌ణి అందిస్తున్నారు. మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్‌. గుల్జార్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభంకానున్న‌ది. మ‌హారాష్ట్ర‌, యూపీ, ఢిల్లీ, బీహార్‌, కోల్‌క‌తా, లండ‌న్ న‌గ‌రాల్లో ఈ సినిమాను షూట్ చేయ‌నున్నారు.ఈ చిత్రానికి స‌హార శ్రీ అనే టైటిల్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement