Sunday, January 23, 2022

స్ట్రీట్ కాజ్ సేవలు ఎనలేనివి.. సమాజాభివృద్ధిలో తనవంతు పాత్ర నిర్వహిస్తోంది…

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : స్ట్రీట్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జిపి బిర్లా సెంటర్‌లో నిన్న‌ నిర్వహించిన హైదరాబాద్‌ యూత్‌ అసెంబ్లి (హెచ్‌వైఏ) సీజన్‌ -11 కార్యక్రమంలో భారత జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లా డుతూ.. నవసమాజ నిర్మాణంలో యువత పాత్ర ముఖ్యమైనది, సమాజ అభివృద్ధికి యువత ఆలోచనలు, ప్రణాళికలు ఎంతో అవసరమని తెలంగాణ ప్రభుత్వం యువత సాధికారతకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

ఈ అసెంబ్లి నిర్వహించేందుకు సేకరించే నిధులను సమాజంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే దారిద్యరేఖకు దిగువన ఉన్న ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తుండటం పట్ల సంస్థ నిర్వాహకులను అభినందించారు. గోపీచంద్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో యువత రాణించగలిగినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని తెలిపారు. ‘ఆంధ్రప్రభ’ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌, డెలాయిట్‌ వంటి సంస్థల సహకారంతో గత పదేళ్లుగా జంట నగరాల్లో 8వేలకు పైగా కార్యక్రమాలు నిర్వ హించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత సమాజ సుస్థిరాభివృద్ధి కోసం వారి ప్రణాళికలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్‌ కాజ్‌ నిర్వాహ కులతో పాటు, హెచ్‌వైఏ సభ్యులు పాల్గొన్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News