Tuesday, November 30, 2021

ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

నేరడిగొండ, (ప్రభ న్యూస్) : ఉన్నత చదువు చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూసినా ప్రభుత్వం తరపున నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బుద్దికొండ గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్సై గుంపుల విజయ్ తెలిపిన వివరాల ప్రకారం… బుద్దికొండ గ్రామానికి చెందిన దాసరి రమేష్ కుమారుడు దాసరి ఓంకార్ (24) ఉన్నత చదువులు చదువు చదివి ఉద్యోగం రాక కొన్ని రోజులు నుండి ఇంటి వద్దనే ఖాళీగా ఉండేవాడు.

పాల వ్యాపారం చేస్తున్న క్రమంలో అందులో కూడా నష్టం రావడంతో ఓ పక్క ఉద్యోగం రాక, మరో పక్క పాల వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి తన మామయ్య పొలంలోకి వెళ్లి వేప‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించి కుటుంబ‌ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News