Sunday, April 28, 2024

National : కడుపు కాదిది… కొకైన్​ లాకర్​….

ముంబై విమానాశ్రయంలో సినిమా రేంజ్ స్మగ్లింగ్ సీన్ చోటు చేసుకుంది. రోజువారి తనిఖీల్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు సియెర్రా లియోన్‌కు చెందిన వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతన్ని స్కానింగ్ చేసి చూడగా.. కడుపులో ఎవో క్యాప్సూల్స్ పెద్ద ఎత్తున దాచి పెట్టినట్లు గుర్తించారు.

- Advertisement -

దీంతో సియెర్రా లియోన్ జాతీయుడి కడుపు నుంచి వైద్యులు 74 కొకైన్ నింపిన క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. కాగా వీటి విలువ రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని మార్చి 28న డీఆర్‌ఐ అరెస్టు చేసి, 1,108 గ్రాముల బరువున్న మందు నింపిన క్యాప్సూల్స్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆస్పత్రిలోని వైద్యుల బృందం అతని శరీరం నుంచి ఈ క్యాప్సూల్స్ తొలగించిందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement