Saturday, December 7, 2024

వ‌రుస‌గా మూడోరోజు న‌ష్టాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా మూడోరోజు న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు.నేడు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. విదేశీ మదుపుదారులు ఇన్వెస్ట్ మెంట్లను వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 59,900కి పడిపోయింది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,859 కి దిగజారింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (1.06%), రిలయన్స్ (0.94%), నెస్లే ఇండియా (0.57%), ఐటీసీ (0.40%), ఎల్ అండ్ టీ (0.23%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.టీసీఎస్ (-2.97%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.63%), టెక్ మహీంద్రా (-2.40%), బజాజ్ ఫైనాన్స్ (-1.95%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement