Tuesday, April 30, 2024

జూన్‌ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2న ఘనంగా అవతరణ ఉత్సవాలను నిర్వహంచనున్నట్లు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన బీఆర్కే భవన్‌లో వివిధ శాఖల కార్యదర్శులు, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉదయమే అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ చేస్తారని ఆయన తెలిపారు.

పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవి సమ్మేళనం రవీద్ర భారతిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్‌, సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవి ఆనంద్‌లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement