Monday, April 29, 2024

AP | పది ఫెయిలైన విద్యార్ధులతో పరీక్ష ఫీజులు కట్టించండి.. డిఇవోలు, ఎంఇవోలకు ప్రభుత్వ ఆదేశాలు

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాలయాల్లో వంద శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియా సాధించేందుకు పది తప్పిన విద్యార్ధుల చేత వచ్చే ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలకు రిజిష్టర్‌ చేయించాలని రాష్ట్రం లోని డిఇవోలు, ఎంఇవోలకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఈ నోటిఫికేషన్‌పై విస్తృతంగా ప్రచారం కల్పించి పది తప్పిన విద్యార్ధులంతా 2024 పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేలా వారి చేత పరీక్ష ఫీజులు కట్టించాలన్నారు.

మూడు సబ్జెక్ట్‌ల కన్నా ఎక్కవయితే 125 రూపాయలు, మూడు సబ్జెక్ట్‌ల లోపు అయితే 110 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఈ రోజు నుండి సెప్టెంబర్‌ 15వ తేదీ లోపు ఎటువంటి లేట్‌ ఫీజు లేకుండా చెల్లించవచ్చు. 50 రూపాయల లేటు ఫీజుతో సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు, రూ.200 రూపాయల లేటు ఫీజుతో 25వ తేదీ వరకు, రూ.500 లేటు ఫీజుతో 30వ తారీఖు వరకు చెల్లించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement