Sunday, April 28, 2024

న‌వ్వులు పూయిస్తోన్న ‘స్టాండ్ అప్ రాహుల్’ ట్రైల‌ర్

స్టాండ్ అప్ రాహుల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు హీరో రాజ్ త‌రుణ్. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శాంటో మోహ‌న్.
వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం టైటిల్‌నుండి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు టీజ‌ర్ సినిమాపైన మంచి బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. వీడి వెట‌కారంతో సంవ‌త్స‌రంలో మూడు ఉద్యోగాలు వెల‌గ‌బెట్టాడు’. ‘జ‌నాల్నీ న‌వ్వించ‌డం ఇట్స్ ఎన్ ఆర్ట్..ఏడ్పించేవాళ్ల‌కి అదేం అర్థ‌మువుతుంది’. అంటూ వ‌చ్చే డైలాగ్స్ హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. ‘ఐఆమ్ ఏ డ్రీమ‌ర్ స‌ర్.. క‌ల్లు మూసి క‌నే క‌ల‌ల్నీ, క‌ళ్ళ ముందే క్రియేట్ చేసుకోవడానికి విఆర్ ఇజ్ ద బెస్ట్ టూల్’ అంటూ వ‌ర్ష డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ‘అంకుల్ మీకు లివింగ్ అంటే తెలుసా చిన్న‌ప్పుడు అమ్మ‌నాన్న ఆట ఆడేవాళ్లం క‌దా అదే పెద్ద‌య్యాక ఆడితే లివింగ్’ అని రాజ్ త‌రుణ్ చెప్పే సంభాష‌ణ‌లు త‌నేంత చిలిపి క్యారెక్ట‌ర్ చేస్తున్నాడో తెలుస్తుంది.ఈ చిత్రాన్ని మార్చి 18న విడుద‌ల చేయ‌నున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement