Thursday, May 9, 2024

ఎస్సారెస్పీలోకి భారీగా వ‌ర‌ద‌ నీరు..

శ్రీరాంసాగర్‌ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ బుధ‌వారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు ఏఈఈ వివరించారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి అంతేస్థాయిలో ఉంది.

ఇది కూడా చదవండి: పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement