Saturday, May 4, 2024

నిండు కుండలా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు దాదాపు నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.31 టీఎంసీలు) కాగా.. గురువారం రాత్రి 9.30 గంటలకు నీటిమట్టం 1090.30 అడుగుల (86.5 టీఎంసీల)కు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాలనుంచి వరద పెరగడంతో ఈఈ చక్రపాణి ఆధ్వర్యంలో ఏడు గేట్లు ఎత్తారు. 21,840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఉదయం నుంచి ప్రాజెక్టులోకి 39 వేల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రికి అది 61,600 క్యూసెక్కులకు పెరిగింది. గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారుఎగువ ప్రాంతాల నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నదని చక్రపాణి చెప్పారు.. ఇక కడెం ప్రాజెక్టులోకి 55 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో గేట్లు ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాజెక్టులకూ స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతున్నది.

ఇది కూడా చదవండి: రేవంత్‌ను 300 కి.మీ. లోతుకు తొక్కుతాం: జీవన్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement