Sunday, May 12, 2024

ODI World Cup | శ్రీలంక ఆలౌట్.. ఆసిస్ టార్గెట్ ఎంతంటే!

వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవ్వాల‌ లక్నో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా టోర్నీలో విజయాలను సాధించలేదు. కాగా, ఈ మ్యాచ్ లో మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.

శ్రీలంక బ్యాట‌ర్ల‌లో పతుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మినహా మిగిలిన వారు అంతగా రాణించలేకపోయారు. దీంతో శ్రీలంక తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఇక‌, ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో మెరిశాడు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement