Sunday, May 5, 2024

SRH vs RCB | హైదరాబాద్‌కు షాక్.. 8 ఓవర్లో 5 వికెట్లు డౌన్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌‌హెచ్ కు గట్టి షాక్ ఇచ్చారు ఆర్సీబీ బౌలర్లు. తొలుత బ్యాటింగ్ చేసి.. ఎస్‌ఆర్‌‌హెచ్ ముందు 207 పరుగులు టార్గెట్ సెట్ చేసిన బెంగళూరు… బౌలింగ్‌లో విజృంబిస్తొంది. భారీ ఛేద‌న‌లో విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లోనే ఒక్క ప‌రుగుకే ట్రావిస్ హెడ్ ఔట‌య్యాడు.

ఆ తరువాత నాల్గవ ఓవర్‌‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(31)కి పెవిలియన్ చేరాడు. ఇక ఐదో ఓవర్ వేసిన స్వపిని సింగ్.. ఐడెన్ మార్క్రామ్ (7), హెన్రిచ్ క్లాసెన్ (7) లను వెనక్కి పంపాడు. దీంతో ఎస్‌ఆర్‌‌హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేయగా.. 8వ ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో కర్ణ్ శర్మ వేసిన రెండో బంతికి నితీష్ కుమార్ రెడ్డి (13) ఔటయ్యాడు. కాగా, 8 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది హైదరాబాద్‌ జట్టు. ఇక ప్రస్తుతం క్రీజ్‌లో షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement