Thursday, May 9, 2024

రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలు, పురోగతిలో 7వేలకు పైగా మైదానాలు.. గ్రామస్థాయిలోనే క్రీడలకు ప్రాధాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. హైదరాబాద్‌ అంతర్జాతీయ క్రీడలకు వేదికలై తెలంగాణ కీర్తి బావుటాను విశ్వవ్యాపంతంచేస్తున్న ప్రస్తుత తరుణంలో క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామస్థాయి నుంచే క్రీడాకారులను తయారుచేసి అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికి తీసే ప్రయత్నం కొనసాగుతుంది. మనసు పెట్టి లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం బాల్యం నుంచే ప్రారంభమైతే భవిష్యత్‌ ఆదర్శంగా ఉంటుందనే ఆశయం తో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. ఆదరణలేక ఇప్పటికే ప్రాచీనక్రీడలు అంతరించి పోవడంతో దేశ వ్యాప్తంగా ప్రాచీన క్రీడల పరిరక్షణకోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో కాకతీయుల కాలంలో సైన్యానికి ఉత్సాహం కల్పించేందుకు రూపొందించిన ప్రేరణ క్రీడ పేరిణి నృత్యంగా ప్రజల్లోకి క్రమేణ వస్తుంది.

అలాగే అనేక రాజవంశాలు ఆదరించిన ప్రాచీన క్రీడలు కలరిపట్టు, మల్లకంబ, థాంగ్‌ టా, గట్క తదితర ప్రాచీన క్రీడలను గ్రామస్థాయిలోనే ప్రోత్సహించాలనే ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామాల్లో ఎకరం భూమిని స్థానిక సంస్థలు క్రీడా మైదానంకోసం సేకరిస్తే ఆస్థలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. క్రీడామైదానాల్లో ప్రముఖంగా కోకో, కబడ్డి, వాలిబాల్‌, లాంగ్‌ జంప్‌ తో పాటు శిక్షకులు అందుబాటులో ఉంటే మరిన్ని క్రీడల్లో గ్రామీణులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాశాఖ సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యప్తంగా 19వేల, 472 క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలను రచించింది. ఇందులో 13వేల 418 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు గుర్తించింది. వీటిలో 10వేల 451 గ్రామపంచాయితీల్లో ఉన్నాయి.

అలాగే 5వేల 602 క్రీడా మైదానాలు, పూర్తి అయ్యాయి. 7, 787 పురోగతిలో ఉన్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నయి. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద క్రీడా మైదానాల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రం క్రీడలకు వేదిక కావానే లక్ష్యంతో ముందుకు వెళ్లుతుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలను సాధించి ప్రపంచంలో తెలంగాణ కీర్తిని చాటుతున్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అనేక రకాల ప్రాత్స హాలను, ప్రాత్సాహాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయినుంచే క్రీడాకారులు తయారైతే అంతర్జాతీయ వేదకల్లో తెలంగాణ కు తగిన ప్రాదాన్యత లభించడంతోపాటుగా యుతలో లక్ష్య సాధనలో పట్టు పెరుగుతుందని పలువురు క్రీడాకారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement