Friday, May 3, 2024

Spl Story : వందకు రెక్కలు..!

  • ఏటీఎంలలో కనిపించని నోట్‌
  • ప్రైవేటు నుంచి జాతీయ బ్యాంకుల ఏటీఎంల వరకు..
  • ఎక్కడ చూసినా రూ.500 నోట్లే..
  • చిల్లరకు ఇబ్బందులు పడుతున్న జనం

హైదరాబాద్‌ నగరంలో వంద రూపాయల నోటుకు రెక్కలొచ్చాయి.. ప్రైవేటు నుంచి జాతీయ బ్యాంకుల వరకు నగర వ్యాప్తంగా ఏ ఏటీఎంలో చూసినా రూ.500 నోట్లే దర్శనమిస్తున్నాయి.. ఫలితంగా నగరంలో చిల్లర కష్టాలు తప్పడం లేదు.. కూరగాయల షాపుల నుంచి మొదలుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వరకు నిత్యం రూ.500 నోట్ల పంచాయితీలు దర్శన మిస్తున్నాయి.
– ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి

డిమాండ్‌ సప్లై మధ్య సమతూకం లేకుంటే అది ఏ రంగంలోనైనా ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్‌ నగరంలో రూ.వంద నోట్ల డిమాండ్‌కు సరిపడా చలామణిలో లేకపోవడంతో జ నం ఇబ్బందులు ప డుతున్నారు. నగరంలో దాదాపు 2వేలకు పైగా ఏటీఎంలు అందుబాటులో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎంలలో గతంలో రూ.2వేలు, రూ.500 తో పాటు రూ.200, రూ.100 నోట్లు అందుబాటులో ఉంచేవారు. రూ.2 వేల నోట్లను ని షేధించిన తర్వాత ప్రైవేటు నుంచి జాతీయ బ్యాంకుల వరకు నగర వ్యాప్తంగా ఏ ఏటీఎంలో చూసినా రూ.500 నోట్లే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా నగరంలో చిల్లర కష్టాలు తప్పడం లేదు. కూరగాయల షాపుల నుంచి మొదలుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వరకు రూ.500 నోట్ల పంచాయితీలు నిత్యం దర్శన మిస్తున్నాయి. చిల్లర అందుబాటులో లేక ఒక్కోసారి జనం తమకు కావాల్సిన వస్తువులను సైతం కొనుగోలు చేయలేకపోతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా నగర ప్రజల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని అన్ని బ్యాంకులు రూ.500 నోట్లతో పాటు ఇతర డినామినేషన్లు సైతం అందుబాటులో ఉంచాలని జనం కోరుతున్నారు.

- Advertisement -

ఆర్‌బీ ఐ సూచనలు భేఖాతర్‌..
గతంలో ఇలాగే చిల్లర సమస్యలు తలెత్తినప్పడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు బ్యాంకులతో పాటు అన్ని జాతీయ బ్యాంకులకు పలు సూచనలు చేసింది. నగర జనాభా, అక్కడ రోజు వారి చలామణి అయ్యే నగదు ఆధారంగా నోట్ల డినామినేషన్ల ను ఏటీఎంలలో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. గతంలో నగరంలోని కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో మాత్రం రూ.100, రూ.200 నోట్లను అందుబాటులో ఉంచేవారు. అయితే చిల్లర నోట్లను ఏటీఎంలలో ఉంచితే నగదు తొందరగా ఖాళీ కావడంతో వాటిని తిరిగి నింపడం ఇడ్డందిగా మారుతోందని అన్ని బ్యాంకులు రూ.500 నోట్లనే అందుబాటులో ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement