Thursday, May 2, 2024

స్పెక్ట్రమ్‌ కొనుగోలు బ‌కాయిలు ప్రీ-పే చేసిన ఎయిర్‌టెల్‌

2014లో స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.15,519 కోట్లను డాట్ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌)కు ముందస్తు చెల్లింపు చేసినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 2014 స్పెక్ట్రం వేలంలో 128.4 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.19,051 కోట్లకు ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసింది. అయితే ఈ బకాయిలను 10 శాతం వడ్డీతో 2026-27 నుంచి 2031-32 మధ్యకాలంలో వార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అవసరాన్ని బట్టి అదనపు సమయం ఇచ్చేందుకు కూడా వీలుంది.

అయితే బకాయిలను ముందే చెల్లించడం ద్వారా రూ.3,400 కోట్ల వరకు వడ్డీ ఆదా చేయవచ్చునని ఎయిర్‌టెల్‌ భావించింది. ఈ కారణంగానే గడువు కంటే ముందే ముందుస్తు చెల్లింపునకు సుముఖత వ్యక్తం చేసింది. దృఢ, సమర్థవంతమైన క్యాపిటల్‌ నిర్మాణాన్ని అందిపుచ్చుకునేందుకు ఎయిర్‌టెల్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. బకాయిలను తర్వాత చెల్లించేందుకు వెసులుబాటు కల్పించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు ఎయిర్‌టెల్‌ ధన్యవాదాలు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement