Friday, December 6, 2024

మూడు జిల్లాల‌కు ప్ర‌త్యేక అధికారులు..

ఏపీ వ‌ర‌ద స‌హాయ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 3జిల్లాల‌కు ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించింది ప్ర‌భుత్వం. చిత్తూరు,నెల్లూరు,క‌డ‌ప జిల్లాల‌కు ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించింది. నెల్లూరు జిల్లాకు ప్ర‌త్యేకాధికారిగా విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్ నియ‌మితుల‌య్యారు. క‌డ‌ప జిల్లాకు ప్ర‌త్యేకాధికారిగా శ‌శిభూష‌ణ్ కుమార్ నియమించారు..చిత్తూరు జిల్లాకు ప్ర‌త్యేకాధికారిగా మార్కెటింగ్ క‌మిష‌న‌ర్ ప్ర‌ద్యుమ్న ని నియ‌మించారు. ..ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం జ‌గ‌న్ కు ప్ర‌త్యేకాధికారులు నివేదిక‌ని అందించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement