Monday, April 29, 2024

Virat Kohli | ఈడెన్ గార్డెన్‌లో కోహ్లీ కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు.. ఎందుకో తెలుసా..?

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌నదైన శైలిలో రాణిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు విరాట్ కోహ్లీ. న‌వంబ‌ర్ 5న కోహ్లీ పుట్టిన రోజు నాడు.. భార‌త జ‌ట్టు సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది. ఇక కోహ్లీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ (క్యాబ్‌) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్ప‌టికే కోహ్లీ కోసం ప్ర‌త్యేకంగా కేక్ ను సిద్ధం చేసినట్టు క్యాబ్ అధ్య‌క్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలిపారు.

ఇక దాంతో ప‌టు మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో.. ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్ అప్పుడు స్టేడియంలో లైటింగ్ షో, ఫైర్ వ‌ర్క్స్ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా, దాదాపు 70 వేల ‘‘కోహ్లీ ఫేస్ మాస్కు’’ల‌ను అభిమానులకు అందించ‌బోతున్నట్టు స్నేహాశిష్ గంగూలీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement