Monday, May 20, 2024

IND vs SA | టాస్‌ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాల రెండో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఆట ప్రారంభమయ్యే కొద్ది సేపటి ముందు వర్షం ఆగిపోవడంతో టాస్ వేసి మ్యాచ్‌ను మొదలు పెట్టారు ఎంపైర్లు. ఇక టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయనుంది.

అయితే, డర్బన్‌ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్‌.. ఎడతెరిపి లేకుండా వ‌ర్షం కురవడంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక‌, ఇప్పుడు సెయింట్‌ జార్జ్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20కి కూడా వర్షపు ముప్పు ఉందని అక్కడి వాతావారణ శాఖ పేర్కొంది. కాగా, ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్‌లో వరుణుడు కరుణించడంతో మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ రోజు అయిన మ్యాచ్‌ను చూడాలని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement