Wednesday, May 8, 2024

శ్రీలంక క్రికెట్‌ ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్‌ సొంతం

భారత దేశానికి చెందిన స్పోర్ట్స్‌ చానెల్‌ సోనీ స్పోర్ట్స్‌ ఈ ఏడాది భారీ ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) గ్లోబల్‌ రైట్స్‌ దక్కించుకుంది. మన దేశానికి చెందిన డిస్నీ స్టార్‌తో పోటీ పడి మరీ హక్కులు స్వంతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి ఈ ఒప్పందం చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది. నాలుగేళ్ల కాలానికి సోనీ స్పోర్ట్స్‌ శ్రీలంక జట్టు మ్యాచ్‌లను ఈ చానెల్‌ ప్రసారం చేయనుంది. అయితే ఎంత మొత్తానికి ఈ ఒప్పందం చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది. దాదాపు రూ 1000 కోట్లకు (23 మిలియన్‌ డాలర్లు) బిడ్డింగ్‌ వేసిందని అంచనా.

కాంట్రాక్టు ధర తగ్గడానికి కారణం టీమిండియా, శ్రీలంకతో ఆడే మ్యాచ్‌లు కొన్నే. వైకోమ్‌ 18 తప్పుకుంది ఎస్‌ఎల్‌ సీ ప్రపంచ హక్కులు సొంతం చేసుకోవడం కోసం నాలుగు భారతీయ కంపెనీలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఫ్యాన్‌ కోడ్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ స్టార్‌, సోనీ స్పోర్ట్స్‌ బిడ్డింగ్‌కు ఆసక్తి చూపించాయి. అయితే మార్చి 1 నాటికి కేవలం రెండు కంపెనీలు మాత్రమే బరిలో నిలిచాయి. మొదట్లో రేసులో ఉన్న వైకోమ్‌ 18 సంస్థ వెంటనే తప్పుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ మీడియా సంస్థ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మీడియా హక్కులు దక్కించుకుంది.

8 మ్యాచ్‌లు

శ్రీలంక- భారత్‌ జట్లు ఎనిమిది మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2024లో మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఎదురు పడనున్నాయి. 2026లో ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్‌లు సిరీస్‌ జరగనుంది. 2023 ఏప్రిల్‌ నుంచి 2027 మార్చి వరకు సోనీ స్పోర్ట్స్‌ ఒప్పందం కొనసాగనుంది. అయితే వచ్చే నాలుగేళ్లలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరగొచ్చనే నమ్మకంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీలంక జట్టు స్వదేశంలో పలు జట్లతో 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement