Monday, May 6, 2024

CBSEకి కొత్త అర్థం చెప్పిన సోనూసూద్

అన్ని పరీక్షలను రద్దు చేయాల్సిందే అని హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ మరోసారి డిమాండ్ చేశాడు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న వేళ పరీక్షలు పెట్టవద్దని, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని ట్వీట్ చేశాడు. కాగా CBSE పేరును మారుస్తూ సోనూసూద్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. C అంటే Cancel, B అంటే Board’s, S అంటే Sabhi, E అంటే EXAMS (అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేయండి) అని అర్థం వచ్చేలా CBSEకి సోనూసూద్ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.

కాగా ఇటీవల కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్‌ను పంజాబ్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సోనూసూద్ సొంత రాష్ట్రం పంజాబ్. పంజాబ్‌లోని మోగా సోనూ స్వస్థలం కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement