Saturday, May 4, 2024

పెళ్లి తేదీ ప్రకటించిన గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన పెళ్లి తేదీని ప్రకటించింది. కొంతకాలంగా తమిళ నటుడు విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ప్రేమలో ఉంది. క‌రోనా లాక్ డౌన్ సమయంలో వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని ఇటీవ‌లే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పిన‌ట్లే గుత్తా జ్వాల, విష్ణు విశాల్ త‌మ పెళ్లి తేదీని ఉగాది పర్వదినం రోజు సోషల్‌ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. తమ కుటుంబ స‌భ్యుల ఆశీర్వాదాల‌తో పెళ్లి చేసుకుంటున్నామని గుత్తా జ్వాల- విష్ణు విశాల్‌ తెలిపారు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ నెల 22న త‌మ‌ పెళ్లి జ‌రుగుతుంద‌ని ప్రకటించారు. త‌మ‌పై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement