Tuesday, April 23, 2024

పోలవరం మోడీ వరం..

తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి, పోలవరంకు  నిధులు అన్నీ కేంద్రం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. లక్షలాది రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. అభివృద్ధిపై టిడిపి, వైసిపితో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులే అని తెలిపారు. క్రైస్తవులకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, కొంతమంది వైసిపి నాయకులు చర్చ్ లో ప్రార్థన లో పాల్గొంటున్నారని చెప్పారు. తాము స్వామి వారి నామం పెట్టుకుంటే వైసీపీ మంత్రులు హేళనగా మాట్లాడడం చాలా దారుణమన్నారు. శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్తులు ఉన్నారని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు అన్యమతస్తులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ వైఖరిని బిజెపి ఖండిస్తుందని సోము స్పష్టం చేశారు.  చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు  వేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. అమిత్ షా పైన తెలుగుదేశం జెండాలు పట్టుకుని రాళ్ళు వేశారని, మోడీ వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారని సోము గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement