Thursday, May 9, 2024

అప‌ర కుబేరులు పేద‌లుగా మారితే – ఫోటోస్ ..

ప్ర‌పంచంలోనే అత్యంత కుబేరులు పేద‌వారైతే ఎలా ఉంటార‌ని ఊహిస్తూ నెటిజ‌న్ రూపొందించిన‌ ఇమేజ్‌లు నెట్టింట వైర‌ల‌వుతున్నాయి. జెఫ్ బెజోస్ నుంచి ఎల‌న్ మ‌స్క్ వ‌ర‌కూ ప‌లువురు బిలియ‌నీర్లు బికారులుగా పుడితే ఎలా ఉంటార‌నే ఊహ‌కు ఈ చిత్రాలు ఊపిరిపోశాయి. ఆర్టిస్ట్ గోకుల్ పిళ్లై మిడ్‌జ‌ర్నీ యాప్‌తో ప్ర‌పంచ కుబేరుల‌ను పేద‌లుగా ఆయా ఫోటోల్లో మార్చేశారు. ఈ చిత్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌, బిల్ గేట్స్‌, ముఖేష్ అంబానీ, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, వారెన్ బ‌ఫెట్‌, జెఫ్ బెజోస్‌, మ‌స్క్ వంటి సంప‌న్నులు పేద‌లుగా క‌నిపించారు. మురికివాడ‌ల్లో వీరంతా నిలుచుని, చిరిగిన బ‌ట్ట‌ల్లో క‌నిపిస్తారు. ఈ పోస్ట్‌కు ఇప్ప‌టివ‌ర‌కూ 13వేల లైక్స్ ల‌భించాయి. కొస మెరుపు ఏమిటంటే స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్స్‌ అని పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇవ్వ‌డం..

Advertisement

తాజా వార్తలు

Advertisement