Sunday, April 28, 2024

Skid on Runway – అత్య‌వ‌స‌ర ల్యాండిగ్ తో ర‌న్ వే పై జారిన విమానం …

బెంగళూరు లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. హాల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ముందు వైపునున్న నోస్ ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్ అవలేదు. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది

.

ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై ప్రమాదానికి గురైంది. రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement