Tuesday, April 30, 2024

Sarkaru Vaari Paata: ‘స‌ర్కారు వారి పాట’ నుంచి ‘పెన్నీ’ ప్రోమో.. పాటలో స్పెషల్ గెస్ట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ సర్కారు వారి పాట. గీతాగోవిందం ఫేం ప‌రుశురాం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటంగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి విడుద‌లైన ‘క‌ళావ‌తి’ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మ‌దిన్న‌ర కోట్ల మంది వీక్షించారు. టాలీవుడ్‌లోనే హైయెస్ట్ ఫాస్ట్ వ్యూవుడ్ లిరిక‌ల్ సాంగ్‌గా క‌ళావ‌తి రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రంలోని ‘పెన్నీ’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు.

ఈ పాట‌లో మ‌హేష్‌బాబు కూతురు సితార కూడా న‌ర్తించ‌డం విశేడం. సితార నర్తించిన ఈ పాట‌ను మ‌ర్చి 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్రొమోలో ప్ర‌క‌టించారు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌రువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రమిది. అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న స‌ర్కారు వారి పాట‌ చిత్రాన్ని మైత్రీ మైవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

https://youtu.be/T30RoCkiovE
Advertisement

తాజా వార్తలు

Advertisement