Friday, April 26, 2024

“ప‌క్క క‌మ‌ర్షియ‌ల్” లో సిరివెన్న‌ల చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం..

గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పక్కా కమర్షియల్‌’. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షి యల్‌స‌లో ఉంది. ఫిబ్రవరి 2వ తేదీన
పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్‌ అవుతున్నారు. ”జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు” అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని సాహిత్యం తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్‌ అయ్యారు. ”తన మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు” అంటూ.. సిరివెన్నెలని గుర్తు చేసుకున్నారు మారుతి.

ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్‌ టైటిల్‌ సాంగ్‌ లో ఉంటాయని మారుతి చెప్పారు. సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. యువి క్రియేషన్స్‌ గీతా ఆర్ట్స్‌ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement