Thursday, May 2, 2024

రెండో దశలో 232 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు.. టెండర్లు ఆహ్వానించిందని సింగరేణి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సింగరేణి రెండో దశలో ఏడాదిలోగా 232 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సింగరేణి టెండర్లు ఆహ్వానించిందని సంస్థ సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల నిర్మించనున్న ఈ ప్లాంట్ల నిర్మాణ అంచనా వ్యయం రూ. 1,348 కోట్లు అవుతుందని, ఈ నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నిర్మాణం పనులు సమర్థులైన ఎజెన్సీలకు అప్పగించాలని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికల్లా 232 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి, విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆయన సూచించారు.

సోలార్‌ ప్లాంట నిర్మాణానికి మందమర్రిలోని 240 ఎకరాల్లో 67.5 మెగావాట్లు, రామగుండం ఏరియాలోని ఓవర్‌బర్డ్‌ డంపు, నేలపై కలిపి 166 ఎకరాల్లో 37 మెగావాట్లు, శ్రీరాంపూర్‌ ఏరియాలోని 96 ఎకరాల్లో 27.5 మెగావాట్లు, కొత్తగూడెంలోని 130 ఎకరాల్లో 32.5 మెగావాట్లు, ఇల్లందు ఏరియాలోని 55 ఎకరాల్లో 15 మెగావాట్లు, భూపాలపల్లిలోని 45 ఎకరాల్లో 10 మెగావాట్లు, రామగుండం ఒకటో ఏరియాలోని 13 ఎకరాల్లో 5 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మెదటి దశలో ఏర్పాటు చేసిన 300 మెగావాట్ల ప్లాంట నిర్మాణంలో 224 ప్లాంట్ల నిర్మాణం నుంచి ఇప్పటీ వరకు 731 మిలియన్‌ విద్యుత్‌ ఉత్పత్తి అయిందని, తద్వారా రూ. 515 కోట్లు ఆదా చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా సింగరేణి గనులు, కాలనీలు అవసరాల కోసం 700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుందని, దీనికోసం కంపెనీ సూమారుగా రూ. 490 కోట్లు డిస్కంలుకు చెల్లించేవారమన్నారు. సింగరేని స్థాపించిన సోలార్‌ పవర్‌ ప్లాంట్ల వల్ల విద్యుత్‌ ఉత్పత్తి కావవడంతో కంపెనీకి ఏడాదిలో రూ. 240 కోట్లు ఆదా జరిగిందన్నారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు డి. సత్యనారాయణ, సంజయ్‌కుమార్‌, జేఎన్‌సింగ్‌, బస్వారెడ్డి, మేనేజర్‌ జానికిరామ్‌, వీకేవీ రాజు, సూర్యనారాయణ, కేఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుధాకర్‌ తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement