Tuesday, April 30, 2024

అత్యంత సురక్షిత దేశం సింగపూర్‌.. తర్వాతి స్థానాల్లో తజకిస్తాన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌, గాలప్‌.. గ్లోబల్‌ అనలిటిక్స సర్వే నివేదిక

ప్రపంచంలో తూర్పు ఆసియా అత్యంత సురక్షిత ప్రాంతమని గ్లోబల్‌ అనలిటిక్స్‌ సంస్థ గాలప్‌ తన సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన, అతి తక్కువ సురక్షితమైన దేశాలను గాలప్‌ జాబితా చేసింది. 120 దేశాల్లో, 1.27 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. శాంతి భద్రతల కోణంలో జరిపిన ఈ సర్వేలో తూర్పు ఆసియాను ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రదేశంగా ప్రకటించింది. ఆగ్నేయాసియా రెండవ స్థానంలో నిలిచింది. తాలిబాన్‌ పాలన కారణంగా మితిమీరిన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న అఫ్గానిస్తాన్‌ను లా అండ్‌ ఆర్డర్‌ సూచీ-2022లో అట్టడుగు స్థానాన ఉంచింది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప సురక్షిత దేశమని నివేదించింది. అయితే 2021 కంటే ఈ ఏడాది మెరుగైన స్కోర్‌ (51 పాయింట్లు) సాధించింది. సర్వేనివేదికలో 96 పాయింట్లతో సింగపూర్‌ అత్యంత సురక్షిత దేశంగా మొదటి స్థానం దక్కించుకుంది.

భారత్‌ 80 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్‌ పొరుగుదేశాలైన పాకిస్తాన్‌, శ్రీలంక కంటే తక్కువ కావడం శోచనీయం. అదే సమయంలో యూకే, బంగ్లాదేశ్‌ కంటే ముందున్నది. ఇక ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లలో పోలీసులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ప్రత్యేకించి అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య, ఉన్నత స్థాయి పోలీసుల కాల్పులను ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. టాప్‌ -5 అత్యంత సురక్షిత దేశాల జాబితాలో సింగపూర్‌ (96), తజకిస్తాన్‌ (95), నార్వే (93), స్విట్జర్లాండ్‌(92), ఇండోనేషియా (92) కీర్తిని సంపాదించగా, టాప్‌ 5 కనిష్ట సురక్షిత దేశాలుగా అఎn్గానిస్తాన్‌ (51), గాబాన్‌ (54), వెనిజులా (55), కాంగో (58), సియెర్రా లీయోన్‌ (59) అప్రదిష్టను మూటగట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement