Sunday, April 21, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల దుర్మరణం

జోగులాంబ : రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లీకూతుళ్లు మృతి చెందిన ఘ‌ట‌న జోగులాంబ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఇటిక్యాల మండలం కోదండా పూర్ ధర్మవరం జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి, కూతురు శ్రీలత అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా తండ్రి ప్రకాశ్‌, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన నలుగురు కారులో తిరుపతికి వెళ్తుండగా ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. వెంట‌నే గాయపడ్డ వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement