Monday, April 29, 2024

శుభ్‌మాన్ గిల్‌కు ఐసీసీ భారీ జరిమానా.. అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకేనా?

ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టైటిల్ డిసైడర్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు మొత్తం భారత జట్టుకు 100% పెనాల్టీ విధించగా, థర్డ్ అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో గిల్‌కు అతని మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించారు.

- Advertisement -

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో గిల్ బ్యాటింగ్ అప్పుడు వివాదాస్పద క్యాచ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బౌలింగ్ జట్టుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు థర్డ్ అంపైర్‌పై పలువురు దుమ్మెత్తిపోశారు. గిల్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఈ అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గిల్‌కి అదనపు జరిమానా విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి బహిరంగ విమర్శలు లేదా అనుచిత వ్యాఖ్యాలు చేయ‌డం ఆర్టికల్ 2.7ను ఉల్లంఘించినట్టు అవుతుంద‌ని ICC తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement