Monday, May 6, 2024

Breaking: సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు..

ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయితే ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ ఉదయం విచారించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది. వాదనల సందర్భంగా ఈడీ తమ వాదనలను వినిపిస్తూ… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement