Sunday, April 28, 2024

Costliest – ఆ టీ పొడి రూ.10 కోట్లే

మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అల‌వాటు. ఒకవేళ టీ ఉదయాన్నే తాగకపోతే ఆరోజు అంతా ఎలాగో ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ తాగిన తర్వాతే మిగతా పనులను మొదలుపెడతారు. మరికొందరికి అయితే సాయంత్రం పూట కూడా టీ తాగకపోతే తలనొప్పి వస్తుందంటే చెప్పడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇలా మనం తాగే కేజీ టీ పొడి ధర 400 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు చూసి ఉంటాం. ఇది పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే టీ పొడి ధర.

ఆ టీ తాగాలంటే ఆస్తులు అమ్మాల్సిందే

ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి ధర వింటేనే అబ్బో అనాల్సిందే. అయితే ఈ టీ కేవలం బిలినియర్స్ మాత్రమే కొనగలరు. ఇక కేజీ టీ కొనాలంటే మన ఆస్తులు కూడా సరిపోవు. ఎందుకంటే.. దీనికి కారణం లేకపోలేదు. ఆ టీ పొడి కిలో కొనాలంటే మనం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంత ఖరీదు పెట్టి కొనగలే స్తోమత మన దేశంలో చాలాచాలా తక్కువ. ఇక ఈ ఖరీదైన టీ పొడి విశేషాలు చూస్తే.. ఇది చైనాలో దొరికే.. డా హాంగ్ పావ్. ప్రసిద్ధమైన తేయాకు చైనాలో కూడా ఎక్కడపడితే అక్కడ ఈ తేయాకు మొక్కలు పెరగవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభిస్తాయి. అరుదుగా కాబట్టి ఈ తేయాకు ఖరీదైనదిగా మారింది. నిజానికి ఈ తేయాకు పెరగడానికి చాలా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, అలాగే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అవసరం. ఈ టీ పొడికి అంత డిమాండ్ కారణం.. తేయాకులో ఎన్నో మెడిసిన్ లక్షణాలు ఉండడమే.

విదేశీ అధిప‌తుల‌కు అపురూప కానుక ఇదే

చైనాలో ఈ టీ పొడిని కొన్నిసార్లు వేలం వేస్తారు కూడా. ఇలా వేలం వేసిన సమయంలో అక్కడికి వెళ్లి ఆ టీ పొడిని కొని తెచ్చుకోవాలి. ఆ దేశ ప్రభుత్వం ఈ టీ ఆకును చాలా విలువైన సంపదగా భావిస్తుంది. అంతేకాదు వారు దానిని తమ జాతీయ సంపదగా ప్రకటించుకుంది చైనా. ఎప్పుడైనా ఆ దేశ అధ్యక్షుడు ఇతర దేశాల అధ్యక్షులకు ఈ టీ పొడిని బహుమతిగా కూడా పంపిస్తుంటారు. కాకపోతే వారిచ్చే బహుమతి 200 గ్రాములకు మించి ఉండదుఅనుకోండి. దీనికి కారణం.. కేవలం 20 గ్రా. ల టీ పొడి కోసం రూ. 23 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ టీ ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ పొడి రకంగా పేరు గాంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement