Monday, May 20, 2024

TS | రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఇవ్వాల‌ సాయంత్రం సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఈ సందర్భంగా షర్మిల అభినందనలు తెలిపారు.

అనంతరం తన కొడుకు ఎంగేజ్‌మెంట్, విహావానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం షర్మిల భేటీ కానున్నారని సమాచారం. కాగా, షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ తన ప్రియురాలితో ఈ నెల 18వ తేదీన జరగనుండగా.. వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement