Thursday, October 31, 2024

Order.. Order: మహిళలకు ఇష్టం లేకుండా సెక్స్ – పెళ్లయినా, కాకున్నా అది నేరమే!

Women Rights: పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇష్టం లేకుండా సెక్స్ చేయడాన్ని మహిళలు ఒప్పుకోవాలా? వారి హక్కులను కోల్పోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఓ కేసు విచారణలో భాగంగా వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకూ ఉంటుందని ఉద్ఘాటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ ధర్మాసనం ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

మరి రేప్ కేసు వర్తిస్తుందా?

‘‘పెళ్లయినంత మాత్రాన.. భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా- మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)- 375 (అత్యాచారం) సెక్షన్‌ ఆ కేసులో వర్తించదా? ఇది సరికాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇష్టం లేకుండా సెక్స్ ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఐపీసీ-375 సెక్షన్‌ పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు,  రాజ్యాంగంలోని అధికరణం-14, అధికరణం-21లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. 50దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తుచేసింది ఢిల్లీ కోర్టు. అయితే ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నందిత రావ్‌ మాత్రం భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ మినహాయింపులు భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

అలా చేయడం నేరం కాదా?

- Advertisement -

దీంతో జస్టిస్‌ శక్ధేర్‌ కలుగజేసుకొని.. ‘‘ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనుకోండి…  అయినప్పటికీ బలవంతంగా అతను లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదా?’’ అని ప్రశ్నించారు. అయితే ‘‘అది నేరమే.  కానీ, అత్యాచార చట్టం పరిధిలోకి రాదు’’ అని నందిత బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సహజీవనం చేసేవారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తుంది. వివాహిత విషయంలో రాదు ఎందుకు? అని ప్రశ్నిస్తూనే.. సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement