Tuesday, April 30, 2024

ఆత్మ‌హ‌త్య‌కి ప్ర‌య‌త్నించిన బెంగాలీ న‌టుడు-భార్య‌..అత్త‌మామ‌లే కార‌ణమ‌ని సెల్ఫీ వీడియో

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ మ‌ధ్య‌కాలంలో మ‌ర‌ణాలు అధిక‌మ‌వుతున్నాయి. ప‌లువురు అనారోగ్య‌రీత మ‌ర‌ణిస్తుంటే.మ‌రికొంద‌రు ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డుతున్నారు. కాగా మ‌రో బెంగాలీ న‌టుడు సాయిబాల్ భట్టాచార్య ఆత్మ‌హ‌త్య‌కి ప్ర‌య‌త్నించారు. కస్బాలోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. మద్యం మత్తులో భట్టాచార్య తనను తాను గాయపర్చుకున్నారని పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను చిత్తరంజన్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. నటుడు ఆత్మహత్యకు యత్నించడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో తన ఈ పరిస్థితికి తన భార్య, అత్తమామలే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం ఆ వీడియో డిలీట్ అయింది. బెంగాలీ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పల్లవి దేవ్, బిదిషా డే మజుందార్, మోడల్, నటి మంజుషా నియోగి ఉన్నారు. ఇప్పుడు సాయిల్ భట్టాచార్య ఆత్మహత్యకు యత్నించారన్న వార్త కలకలం రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement