Saturday, May 4, 2024

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు.. వాయిదా వేయాలంటూ బీసీసీఐకి లేఖ‌లు

వన్డే ప్రపంచకప్‌ సమస్యలు హైద‌రాబార్ క్రికెట్ అసోసియేష‌న్ ను వెంటాడుతూనే ఉన్నాయి. వ‌ర‌ల్డ్ క‌స్ కి సమయం సమీపిస్తున్న కొద్దీ, షెడ్యూల్‌లో మార్పులు చేయాలంటూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు బీసీసీఐకి లేఖలు పంపుతూనే ఉన్నాయి. ఉప్పల్ వేదికగా జరగనున్న పాక్-శ్రీలంక మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇటీవల బీసీసీఐని అభ్యర్థించింది.

ఉప్పల్ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం..

- Advertisement -

ఈ మెగా టోర్నీలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.

భద్రతా సమస్యలు

ఓ వైపు తెలంగాణలో అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, మరోవైపు వరుస రోజుల్లో మ్యాచ్ ల నిర్వహణపై హైదరాబాద్ పోలీసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య కనీసం ఒక్కరోజు గ్యాప్ ఉండేలా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లిన వారు..అక్కడి నుంచి బీసీసీఐకి చేరినట్లు తెలుస్తోంది.

తొలి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12న శ్రీలంక-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారత్-పాక్ మ్యాచ్ అక్టోబరు 14కి రీషెడ్యూల్ కావడంతో.. లంకతో మ్యాచ్ ను అక్టోబర్ 10కి మార్చి పాక్ జట్టుకు తగిన సమయం ఇచ్చింది. అలాగే, కోల్‌కతాలో జరగాల్సిన పాకిస్థాన్-ఇంగ్లాండ్ మ్యాచ్ నవంబర్ 12న కాకుండా నవంబర్ 11న జరగనుంది. HCA విజ్ఞప్తిపై BCCI మరియు ICC ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement