Friday, May 17, 2024

ఉల్లి నిల్వ లక్ష్యం 5 లక్షల మెట్రిక్‌ టన్నులు

3 లక్షల మెట్రిక్‌ టన్నుల తొలి సేకరణ లక్ష్యాన్ని సాధించిన తర్వాత, ప్రభుత్వం ఈ ఏడాది ఉల్లి బఫర్‌ పరిమాణాన్ని 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ప్రధాన మార్కెట్‌లలో విడుదల చేయడమే కాకుండా, సోమవారం (ఆగస్టు 21) నుండి రిటైల్‌ అవుట్‌లెట్‌లు, ఎన్‌సిసిఎఫ్‌ మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా బఫర్‌ నుండి ఉల్లిపాయలను కిలోకు రూ. 25 రాయితీతో రిటైల్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

ఇతర ఏజెన్సీలు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లను చేర్చుకోవడం ద్వారా ఉల్లిపాయల రిటైల్‌ విక్రయం రాబోయే రోజుల్లో తగిన విధంగా మెరుగుపడనుంది. ప్రధాన వినియోగ కేంద్రాలలో సేకరించిన స్టాక్‌లను క్రమాంకనం చేయడంతో పాటు, అదనపు సేకరణ లక్ష్యాన్ని సాధించడానికి 1లక్ష టన్నులు సేకరించాలని ఎన్‌సిసిఎఫ్‌, ఎన్‌ఎఎఫ్‌ఈడీలను వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

రిటైల్‌ ధరలు ఆల్‌-ఇండియా సగటు కంటే ఎక్కువగా ఉన్న లేదా గతనెల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని బఫర్‌ నుండి ఉల్లిపాయల తరలింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు బఫర్‌ నుంచి సుమారు 1,400 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు లక్షిత మార్కెట్‌లకు పంపబడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement