Thursday, May 2, 2024

Tillu Square | కొత్త ‘రాధిక’తో టిల్లు స్టెప్పులు.. వీడియోతో

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా, ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇవ్వాల ‘రాధిక’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ఫుల్ వర్షన్‌ని విడుదల చేశారు మేకర్స్.

YouTube video

ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిగా.. రామ్ మిరియాల సంగీతం అందిస్తూ పాటని పాడారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘టిల్లు స్క్వేర్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement