Sunday, April 28, 2024

Kaikaluru – మూడో వివాహం చేసుకున్న వైసిపి ఎమ్మెల్సీ వెంక‌ట రమ‌ణ …సాక్షి సంత‌కం చేసిన రెండో భార్య

కైక‌లూరు .. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుజాతను ఆయన పెళ్లాడారు. ఈ ఉదయం కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు ఒకటయ్యారు. ఈ పెళ్లికి వెంకటరమణ రెండో భార్య సాక్షి సంతకం చేశారు. అలాగే కుమారుడు కూడా ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. కాగా, వెంకటరమణ తొలి భార్య మృతి చెందడంతో… ఆయన సునీత ను పెళ్లి చేసుకున్నారు. అయితే, కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన సునీత నుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా సుజాతను పెళ్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement