Sunday, May 5, 2024

సీటు బెల్ట్ అలారం రాకుండా స్టాప‌ర్లు.. ఈ కామ‌ర్స్ సైట్‌పై చ‌ర్య‌ల‌కు కేంద్రం ఆదేశాలు

సీట్ బెల్ట్ అలారం స్టాపర్లను విక్రయించిన ఐదు ఆన్‌లైన్ సైట్‌లపై చర్యలు తీసుకున్నారు అధికారులు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఐదు ఈ కామ‌ర్స్ సైట్‌లపై కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ కోసం సెంట్రల్ కమిటీ (CCPA) ఈ చర్యను తీసుకుంటోంది. అలారం స్టాపర్లను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అన్ని ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు.

సీట్ బెల్ట్ ధరించడానికి బదులుగా ఈ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల అలారం ఆఫ్ అవుతోంది. దీంతో వినియోగదారుల భద్రతకు ప్రమాదం ఏర్పడవచ్చు. ఇది వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ఉల్లంఘించడమేనని ఉత్తర్వుల్లో పేర్కొంది CCPA. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను వారి సైట్‌లలోని కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లు.. ప్రయాణికులు, ప్రజల భద్రతకు హాని కలిగించే అన్ని ఇతర మోటారు వాహనాల ఉత్పత్తులను తొలగించాలని ఆదేశించింది. ఇది కాకుండా, అటువంటి ఉత్పత్తులను అమ్మేవారిపై తీసుకున్న చర్యల త‌ప్ప‌వ‌ని CCPA వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement