Saturday, May 18, 2024

సిఎం కార్యాల‌య ముట్ట‌డికి య‌త్నం – సిపిఐ రామ కృష్ణ అరెస్ట్

తాడేపల్లి,మే12(ప్రభ న్యూస్) పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా
తాడేపల్లిలో బైపాస్ రోడ్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరు జిల్లా కొల్లిపర పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్రంలో అకాల వర్షాలకు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.రైతులు ఆందోళనతో వున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం అందించాలని అన్నారు.

అలాగే జీవో నెంబర్ 1 ఒకటిని రద్దు చేస్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని అన్నారు. హైకోర్టు తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని అన్నారు. జీవో నెంబర్ 1 రద్దు చేస్తూ హై కోర్టు తీర్పు నివ్వడంపై ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు హర్షిస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు.ప్ర జాస్వామ్యం అధికార పార్టీకే కాదు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యం ఉండాలని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో రామకృష్ణతో పాటు కంచర్ల కాశయ్య,బాలస్వామి, బెనహర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement