Saturday, May 4, 2024

స్టేజ్ పై క‌ర్ర‌సాము.. జ్యోతిక ధైర్యానికి ప్ర‌శంస‌లు

న‌టి జ్యోతిక పెళ్లిత‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా సాధారణంగా ఏదైనా స్టంట్స్ లాంటివి హీరోలు చేస్తుంటారు. ఒక్కొసారి అది కూడా డూప్ లతో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది జ్యోతికా స్టేజ్ పైన లైవ్ లో ఓ స్టంట్ చేసి చూపించింది. అది కూడా చీరకట్టులో ఉన్పప్పుడు.. వేల మంది చూస్తుండగా.. ఎంతో ధైర్యంగా.. కాన్ఫిడెంట్ గా కర్రసాము చేసి చూపించింది జ్యోతిక. 2020లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరిగింది. తాజాగా మరోసారి ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన తెలుగు-తమిళ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లల తల్లయిన జ్యోతిక.. ఇంత ఫామ్ లో ఉండగటం.. అంత ఎనర్జీ చూపించడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement