Sunday, April 28, 2024

మోగనున్న బడి గంటలు.. సోమ‌వారం నుండి స్కూల్స్ రీఓపెన్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సోమ‌వారం నుంచి బడిగంట మోగనుంది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 38 వేల స్కూళ్లలో మొత్తం 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా రేపటి నుంచి భుజాన పుస్తకాల బ్యాగులు వేసుకొని స్కూళ్లకు వెళ్లనున్నారు. వీరిలో దాదాపు 28 లక్షలమంది వరకు పిల్లలు 26 వేలకు పైగా ఉన్న సర్కారు బడుల్లో చదువుతుంటే, 32 లక్షల మంది విద్యార్థులు 11వేల వరకు ఉన్న ప్రైవేట్‌ బడుల్లో చదువుతున్నారు. ఈనెల 3వ తేదీ నుంచే ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి అడ్మిషన్లు చేపడుతున్నారు.

ఆదివారంతో వేసవి సెలవులు ముగుస్తాయి. 12న బడుల తలుపులు తెరుచుకోనుండటంతో విద్యార్థులు చదువుబాట పట్టనున్నారు. పాఠశాలలు పున:ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని చోట్ల ఇంకా పుస్తకాలు, యూనిఫామ్స్‌ చేరుకోలేదని సమాచారం. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు పదో తరగతి క్లాసులను వారం రోజుల ముందే ప్రారంభించేశారు.

- Advertisement -

ఇదిలా ఉంటే రేపటి నుంచి బడిబాట పట్టే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. చాలా చోట్ల మూత్రశాలలు విద్యార్థులకు సరిపడా లేవు. సరిపడా టీచర్లు లేరు. విద్యావాలంటీర్లను ఈ విద్యాసంవత్సరం కూడా తీసుకోలేదు. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది కూడా తిప్పలు తప్పేలా లేవు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మన బడి పనులు చాలా పాఠశాలల్లో ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement